రాజన్న సిరిసిల్ల, జూలై 16
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిని రాజు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిని రాజు జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి, కార్యకర్తలు, నాయకులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, అక్కనపల్లి కరుణాకర్, కన్నం సాగర్, కమల్ గౌడ్, దూస మధు, పెగ్గర్ల శేఖర్, నల్లగొండ అనిల్ కుమార్, పెగ్గర్ల శంకరయ్య, జేరిపోతుల నాగరాజు తదితరులు పాల్గొని బోయిని రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.












