భైంసా, 2023-09-02
బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి నల్లరంగు పూసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం భైంసా పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
రవిదాస్ చిత్రపటాన్ని అవమానించడాన్ని ఖండిస్తున్నాం
బాధ్యులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ ఎస్సీ మోర్చా
భైంసా, సెప్టెంబరు 2: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటంపై నల్లరంగు పూసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం భైంసా పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ సూచన మేరకు, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో, నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సాదుల ప్రభాకర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయం వద్ద సంత్ గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించేలా నల్లరంగు పూయడం అత్యంత దారుణమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంత్ గురు రవిదాస్ మహారాజ్ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనను అవమానించే చర్యలు తెలంగాణలోని ఎస్సీ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు.
ఈ ఘటనకు బాధ్యులైన యువజన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని నిబంధనలతోపాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్సీ సమాజ ఆత్మగౌరవాన్ని అవమానించే చర్యలను బీజేపీ ఎస్సీ మోర్చా సహించబోదని నాయకులు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












