బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి, తాంసి కె, భీంపూర్, గుంజాల గ్రామాల్లో మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి ఆడే గజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తూ, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు.
భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి, తాంసి కె, భీంపూర్, గుంజాల గ్రామాల్లో మాజీ ఎంపీ సోయం బాపురావుతో కలిసి ఆడే గజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం గ్రామాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడారు.
గ్రామస్తులు తమ సమస్యలను ఆడే గజేందర్ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, భీంపూర్ మండల అధ్యక్షుడు సుదర్శన్, తాంసి మండల అధ్యక్షుడు కౌడల సంతోష్, భీంపూర్ సర్పంచ్ రవీందర్, అర్లి సర్పంచ్ అశోక్, పిప్పల్‌కోటి సర్పంచ్ దాసరి రమేష్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తన్వీర్ పటేల్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు అను పటేల్, మతీన్ పటేల్, శ్రీనివాస్, కృష్ణ, ఎండీ సద్దాం, అనుపట్ల సంజీవ్, కరీం, ఖమర్ తదితరులు పాల్గొన్నారు.












