రాజన్న సిరిసిల్ల, జూలై 22
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 67వ జన్మదిన వేడుకలను బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టారు.
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 67వ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ముకరాంపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ నివాసం వద్ద విద్యార్థులతో కలిసి 67 కిలోల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జక్కుల నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో బోయినపల్లి వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును తీసుకువచ్చి నగర అభివృద్ధికి కృషి చేశారని, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం, జాతీయ రహదారుల మంజూరులో విశేష కృషి చేశారని అన్నారు. దేశంలో పార్లమెంట్లో అత్యధికంగా మాట్లాడిన నాయకుల్లో ఆయన ఒకరని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ద్యావ మధుసూదన్ రెడ్డి, గవ్వ వంశీధర్ రెడ్డి, రెడ్డవేణి తిరుపతి, సంపత్ గౌడ్, సాయికృష్ణ, సముద్రాల ఓంకార్, శ్రావణ్, మహేందర్, ప్రవీణ్, నిఖిల్, దీపక్, విజేందర్ రెడ్డి, రమేష్, వంశీ, అనిల్, దిలీప్, ప్రసాద్, అశోక్, సాయి, శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.











