నిర్మల్, 2026-07-22
ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ పట్టణంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉందని, ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు.
ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పల కావ్య చక్రవర్తి, లైబ్రరీ చైర్మన్ సయ్యద్ అర్జుమాన్ అలీ, డిసిసిబి వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, FSCS చైర్మన్ ధర్మాజీ రాజేందర్, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ ఆకుల హరీష్, మాజీ జెడ్పిటిసి పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, PACS చైర్మన్ పీవీ రమణ రెడ్డి, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ MA మతిన్, DCC జనరల్ సెక్రెటరీ జుబీద్, పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్, డిసిసి అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, DCC ప్రధాన కార్యదర్శి మల్లేష్, కౌన్సిలర్ నాదెడం చిన్ను, మేడారం ప్రదీప్, శ్రీధర్, అమెడ శ్రీధర్, కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, వినయ్, రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొని రాహుల్ గాంధీ అరెస్టును ఖండించారు.











