Dr. B.R. Ambedkar Konaseema/Peravali (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 06
సాంఘిక సంక్షేమ శాఖపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నాయకులను ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తీవ్రంగా ఖండించారు. అమరవీరుల స్మృతి స్థలాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని, చర్చలకు అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
సాంఘిక సంక్షేమ శాఖపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ తీవ్రంగా ఖండించారు.
అమరవీరుల స్మృతి స్థలాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని, నిజంగా చర్చకు సిద్ధమైతే ప్రజలు ఎన్నుకున్న శాసనసభల్లోనే చర్చించాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కలకారులను రాజకీయ ఆరోపణలకు వేదికగా మార్చడం అత్యంత బాధాకరమన్నారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమని విమర్శించారు. అసెంబ్లీలోనే చర్చకు సిద్ధమని, సాంఘిక సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై సవాళ్లు విసరడం మానేసి శాసనసభకు వచ్చి ఆధారాలతో మాట్లాడాలని అన్నారు.
ముఖ్యంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరై సాంఘిక సంక్షేమ శాఖ, దళిత బంధు, గురుకుల విద్య, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై బహిరంగంగా చర్చించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో సాంఘిక సంక్షేమ రంగం తీవ్రంగా నష్టపోయిందని, ముఖ్యంగా దళిత బంధు పథకాన్ని అందరికీ అమలు చేయకుండా కొందరికే పరిమితం చేశారని, వేలాది అర్హులను నిరాశపరిచారని తెలిపారు.










