ఆర్మూర్, జూలై 23
ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గురువారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల రెవెన్యూ అధికారిని కలిసి ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారిని కలిసి ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బూత్ స్థాయి ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ఆలూరు బూత్‌లో 95 శాతం ప్రత్యేక ఓటరు నమోదు పూర్తి చేసిన సందర్భంగా బూత్ స్థాయి ప్రతినిధి లావణ్యను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












