నిర్మల్, 2026-07-23
దేశ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నిర్మల్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దేశ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిర్మల్లో నిరసన దీక్ష చేపట్టారు. నిర్మల్ జిల్లా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశ యువత, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ఈ సంఘీభావ నిరాహార దీక్షలో జిల్లా నాయకులు సేపురి సిద్ధార్థ, ధామా భూమేష్, దేవుళ్ళ మధుకర్, మసీదు రమేష్ పాల్గొన్నారు.












