వరంగల్, జులై 08
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగించాలని ఆమె సూచించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆమె సందర్శించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగించాలని ఆమె సూచించారు.
బుధవారం వెస్ట్‌జోన్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు వెస్ట్‌జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ పూల మొక్కను అందజేశారు. అనంతరం స్టేషన్ పరిసరాలను, విధులు నిర్వహిస్తున్న అధికారులను, సిబ్బందిని ఆమె పరిశీలించి, వారి విధులకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ రికార్డులను, పరిధిలోని తరుచు జరిగే నేరాలను, గ్రామాల స్థితిగతులను, స్టేషన్ నిర్వహణపై కమిషనర్ ఆరా తీశారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణును పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల కోసం పనిచేస్తున్నామని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రశీదు అందజేయాలని, ఫిర్యాదుదారులను ఎక్కువసేపు స్టేషన్లో నిరీక్షించేలా చూడొద్దని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తెలియజేశారు.












