ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ(సర్) ఫారాలను పూరించడంలో బి ఎల్ ఓ లు జాగ్రత్తలు తీసుకోవాలి : ఆర్డిఓ రమణారెడ్డి
మిర్యాలగూడ జూలై 8:- (మనోరంజని తెలుగు టైమ్స్)
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ(ఎస్ఐఆర్)ఫారాలు పూరించడంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని మిర్యాలగూడ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఓటర్ నమోదు అధికారి ఎస్. రమణారెడ్డి ఆదేశించారు. ఎస్ఐఆర్ పై స్థానిక డివిజన్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో కొంతమంది బిఎల్ఓలు సక్రమంగా ఫారాలు పూరించడం లేదని ఆరోపించగా సమాధానమిస్తూ బిఎల్ఓలకు అర్ధం కాకుంటే రాయలేకపోతే సూపెర్వైజర్లను రాయమని ఆదేశిస్తామన్నారు. ఆయా రాజకీయ పార్టీలు సూచించి ప్రభుత్వ ఆమోదం పొందిన బూత్ లెవెల్ ఏజెంట్ (బిఎల్ఎ)లను ఎస్ఐఆర్ కార్యక్రమంలోభాగస్వాములు చేయాలన్నారు. ఎస్ఐఆర్ అనంతరం పోలింగ్ బూత్ ల రేషనలైజేషన్ ఉంటుందన్నారు. 200 మంది ఓటర్లకు ఒక బూత్ ఏర్పాటు చేసే ఆలోచన ఎన్నికల సంఘం చేస్తున్నదని త్వరలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ ల ఏర్పాటు ఉంటుందని ప్రజలకు అనుకూలంగా ఉండేలా సలహాలు సూచనలుఇవ్వాలన్నారుసమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నాగమణి, కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ పాతురి శరత్, బిఆర్ఎస్ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి.ఇలియాస్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సజ్జల నాగిరెడ్డి, నాయకులు డి.నారాయణరెడ్డి, ఎఐఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఫారుఖ్, టీజెఎస్ నాయకులు క్రాంతికుమార్, బిఎస్పి నాయకులు దినేష్, ఎస్కె గాలిబ్ లు పాల్గొన్నారు.












