వడ్యాల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
లక్ష్మణ చందా మండలం వడ్యాల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు ఒకటయ్యారు. అందరూ కలిసి ట్రాక్టర్ యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు. రానున్న కేజీవిల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, 'మన ఊరు మన రోడ్డు' లక్ష్యంతో, తమ సొంత నిధులతో షిఫ్టింగ్ ట్రాలీని కూడా రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ శ్రావణి, సర్పంచ్ పసుపుల నరేష్ ప్రారంభించారు.
లక్ష్మణ చందా మండలం వడ్యాల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు అందరూ కలిసి ట్రాక్టర్ యూనియన్ను ఏర్పాటు చేసుకున్నారు. రానున్న రోజుల్లో పొలం పనులకు కేజీవిల్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో, 'మన ఊరు మన రోడ్డు' అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ యూనియన్ ఏర్పడింది. యూనియన్ యజమానులు తమ సొంత నిధులతో కేజీవిల్ ట్రాక్టర్‌ను ఒక చోటు నుండి మరో చోటుకు తరలించడానికి అవసరమైన షిఫ్టింగ్ ట్రాలీని కూడా తయారుచేసుకున్నారు.
ఈ సందర్భంగా షిఫ్టింగ్ ట్రాలీకి మండల ఎస్ఐ శ్రావణి, గ్రామ సర్పంచ్ పసుపుల నరేష్ చేతుల మీదుగా పూజ నిర్వహించి, రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం యూనియన్ యజమానులు ఎస్ఐ శ్రావణి గారిని సన్మానించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి ముందు చెట్టు ఉండాలనే ఎస్ఐ, సర్పంచ్ సూచనల మేరకు గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శ్రావణి మాట్లాడుతూ, నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలో వడ్యాల్ గ్రామం అభివృద్ధిలో ముందుంటుందని, ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల్లో కూడా మార్పు తీసుకురావాలని కోరారు. అనంతరం యూనియన్ సభ్యులకు, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.












