కరీంనగర్, 14/7/2026
జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే బీబీ రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దుచేసి, ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కూలీల వేతనాలు పెంచాలని, బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా బీబీ రాంజీ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తుందని, వెంటనే ఈ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
లేదంటే, సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహించడానికి వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారి వేతనాన్ని 600 రూపాయలకు పెంచాలని ఆయన అన్నారు. పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పట్టణ ప్రాంతాలలో కూడా గ్రామీణ ఉపాధి హామీ పనులు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
పని ప్రదేశాలలో తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు, ఇతర వసతులు కల్పించాలని ఆయన కోరారు.












