Nirmal/Lokeshwaram (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 10
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం లోకేశ్వరం మండలంలోని హావర్గ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వే, ఫారం నింపుదల ప్రక్రియను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్వో పుష్పలత ఇంటింటికీ వెళ్లి నిర్వహిస్తున్న సర్వే, ఫారాల పంపిణీ, స్వీకరణ, నమోదు విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చూడడంతో పాటు, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, నిర్ణీత గడువులోగా ఫారాల సేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్ దార్ సూర్యరావు, హావర్గ గ్రామ సర్పంచ్ భుజంగరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి అరుణ్, బీఎల్వో పుష్పలత, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.