మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి కీలకమైన అలెర్ట్ జారీ అయింది. రేషన్ కార్డుదారుల ఈకేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయని పక్షంలో, కార్డు ఇనాక్టివ్ అయిపోయి రేషన్ సరుకులు పొందే అవకాశం కోల్పోతారు.
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి కీలకమైన అలెర్ట్ జారీ అయింది. రేషన్ కార్డుదారుల ఈకేవైసీ (e-KYC) పూర్తి చేయడానికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. గడువులోగా పూర్తి చేయని పక్షంలో, కార్డు ఇనాక్టివ్ అయిపోయి రేషన్ సరుకులు పొందే అవకాశం కోల్పోతారు.
రేవంత్ సర్కార్ ఈకేవైసీ ధృవీకరణకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించింది. అంటే, ఈ మూడు రోజుల్లోగా ప్రక్రియను పూర్తి చేయకపోతే, కార్డుతో పాటు నెలవారీగా అందే సరుకులను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికీ చాలామంది లబ్ధిదారులు ఈకేవైసీని పూర్తి చేయలేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈకేవైసీ పూర్తి చేయడానికి సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానింగ్ కోసం మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో సమీపంలోని ఏదైనా రేషన్ షాపుకు లేదా మీసేవా కేంద్రానికి వెళితే సరిపోతుంది. ఈ ప్రక్రియకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఉచితంగా పూర్తి చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి లబ్ధిదారుడు, 8 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. జులై 31లోగా పూర్తి చేయకపోతే రేషన్ సరుకులు నిలిచిపోతాయి. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం త్వరలో పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కూడా అందదని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఆగస్ట్ నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1.05 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులను అందించనున్నారు. ఈ స్మార్ట్ కార్డులలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. వీటి ప్రింటింగ్ ఇప్పటికే పూర్తయి, అన్ని జిల్లాలకు పంపించారు. ఆగస్ట్ 1 లేదా ఆగస్ట్ 15 నుంచి వీటిని పంపిణీ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేస్తారు. ఈ స్మార్ట్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలు ఉంటాయి. జులై 31లోగా ఈకేవైసీ పూర్తి చేయని వారికి ఈ స్మార్ట్ కార్డులు అందవని స్పష్టం చేయబడింది.
ఇంకా సుమారు 5 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. జులై 31 నాటికి 100 శాతం ఈకేవైసీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రేషన్ షాపులు, ప్రత్యేక శిబిరాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.












