Delhi, 20 July
కాన్పూర్‌కు చెందిన 32 ఏళ్ల మహిళ టాటూ వేయించుకోవడానికి వెళ్లిన చోట నిర్లక్ష్యం కారణంగా హెచ్ఐవీ బారిన పడింది. ఢిల్లీలోని ఒక పార్లర్లో టాటూ వేయించుకున్న తర్వాత ఆమె శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్తో పాటు హెచ్ఐవీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కలుషితమైన సూది వాడకమే దీనికి కారణమని ప్రాథమికంగా తేలింది.
పచ్చబొట్టు (టాటూ)పై మోజు ఒక 32 ఏళ్ల మహిళ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కాన్పూర్‌కు చెందిన ఈ మహిళ ఢిల్లీలోని ఒక పార్లర్లో టాటూ వేయించుకుంది. అయితే, టాటూ వేయించుకున్న కొద్ది వారాలకే ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ మొదలైంది. ఇది క్రమంగా తీవ్రం కావడంతో ఆ మహిళ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంది.
వైద్యులు ఆమెకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించగా, హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. టాటూ వేయడానికి ఉపయోగించిన ఇంజక్షన్ లేదా నీడిల్స్ కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని జిఎస్‌విఎం మెడికల్ కాలేజీ వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో భాగంగా, ఆమెకు నీడిల్ ద్వారానే హెచ్ఐవీ సంక్రమించినట్లు డెర్మటాలజీ విభాగం పేర్కొంది.
స్టెరిలైజ్ చేయని లేదా కలుషితమైన నీడిల్‌ను ఉపయోగించి టాటూ వేయడం వల్లే ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.












