తానూర్, 2 September
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హెచ్. పుండ్లిక్ అన్నారు. తానూర్ మండల కేంద్రంలో బుధవారం నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తానూర్‌లో కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అద్భుతం
తానూర్, సెప్టెంబరు 2 (మనోరంజని తెలుగు టైమ్స్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హెచ్. పుండ్లిక్ అన్నారు. తానూర్ మండల కేంద్రంలో బుధవారం నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని పుండ్లిక్ తెలిపారు. రైతు భరోసా, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తానూర్ మండలంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












