ఖానాపూర్, 2026-09-02
ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎస్టీయూటీఎస్ సంస్థ తన 80వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖానాపూర్లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ నెల 27న హైదరాబాద్లో జరగనున్న వేడుకలకు ఇది నాంది పలికింది.
ఎస్ టి యు టి ఎస్* 80 వసంతాల సంబరాల గోడ ప్రతుల ఆవిష్కరణ.* ఖానాపూర్ సెప్టెంబర్ 2 ( మనోరంజని తెలుగు టైమ్స్)2026ఎస్ టి యు టి ఎస్ 80 వసంతాల సంబరాల సందర్భంగా ఎస్టియు టీఎస్ కార్యాలయంలో బుధవారం సంఘ నాయకులు గోడ ప్రతుల ఆవిష్కరణ చేశారు. ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, మొదటి పి.ఆర్.సి., డి.ఏ.ల సాధనలో కీలక పాత్ర పోషించిన ఎస్టీయూటీస్ 80 వసంతాలు పూర్తి చేసుకుని, శత వసంతాలకు పరుగులెడుతున్న సందర్భంగా, ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించనున్న 80 వసంతాల వేడుకల గోడప్రతులను రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ జి. సదానందంగౌడ్* , ప్రధాన కార్యదర్శి *శ్రీ జుట్టు గజేందర్* , పూర్వ అధ్యక్షులు శ్రీ *పర్వత రెడ్డి* , ఎస్ భూమన్న యాదవ్,వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవిష్కరించారు.*











