మిర్యాలగూడ, 2026-09-02
మిర్యాలగూడ పట్టణంలో వాసవి క్లబ్ కపుల్స్ మాజీ సెక్రటరీ వాస రమేష్ మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో నేత్రాలను దానం చేశారు. ఈ సంఘటనతో నేత్రదానం ప్రాముఖ్యత మరోసారి వెలుగులోకి వచ్చింది.
నేత్రదానం మహాదానం
మిర్యాలగూడ సెప్టెంబర్ 2 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణం సీతారాంపురం కు చెందిన వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ మాజీ సెక్రటరీ వాస రమేష్ మృతిచెందగా ఐపిసి మిట్టపల్లి విజయభాస్కరరావుకు సమాచారం తెలియడంతో రీజియన్ 10 టీం కు తెలియజేశారు. వాసవి లీడర్స్ వాస రమేష్ స్వగృహం వద్ద రమేష్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం రమేష్ నేత్రాలను వారి కుటుంబ సభ్యుల అనుమతితో రమేష్ నేత్రాలను డైమండ్ నేత్ర నిధి మిర్యాలగూడ వారి ద్వారా అగర్వాల్ హాస్పిటల్ కి అందజేయడం జరిగింది. నేత్రదానం మహాదానమని వాసవి క్లబ్ ఐసీసీ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీలు మిట్టపల్లి విజయభాస్కరరావు, డిస్టిక్ ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ ఇంచార్జ్ సామా శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ పాంపాటి రామలింగయ్య నేత్ర నిధి టెక్నీషియన్ బచ్చలకూరి రమేష్, తదితరులుపాల్గొన్నారు.











