బాసరాలు, 4 September
బాసరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో గోపాలకృష్ణ స్వామివారికి పాలు, పెరుగు, వెన్న, తేనె తదితర పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
బాసరలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు గోపాలకృష్ణ స్వామికి పంచామృతాభిషేకం భక్తులతో కిటకిటలాడిన శ్రీకృష్ణ ఆలయం ( బాసరలోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో గోపాలకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు, వెన్న, తేనె తదితర పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ప్రత్యేక కార్యక్రమాలు శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీకృష్ణుడి పల్లకి సేవ, చిన్నారులకు శ్రీకృష్ణుడు, రాధమ్మ వేషధారణ పోటీలు, ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనే చిన్నారులకు స్వామివారి ప్రతిమలను అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.












