షాద్నగర్, కేశంపేట, రంగారెడ్డి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
రాత్రి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఛేదించి, దొంగిలించబడిన ఐఫోన్, ఆపిల్ వాచ్, నగదును స్వాధీనం చేసుకున్నారు.
*రాత్రి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్* *షాద్నగర్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు..* *ఐఫోన్, ఆపిల్ వాచ్ స్వాధీనం* షాద్నగర్లో రాత్రి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. పట్టణ సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులతో పాటు ఒక ఐఫోన్, ఒక ఆపిల్ వాచ్, రూ.20 వేల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు రోహిత్ కుమార్ (23)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక ఐఫోన్, ఒక ఆపిల్ వాచ్, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందినవాడిగా, ప్రస్తుతం కొత్తూరు ప్రాంతంలో నివసిస్తూ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో షాద్నగర్ డీసీపీ సీ. సిరీష, ఏసీపీ ఎస్. లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పోలీసు అధికారులు, క్రైమ్ టీమ్, సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలను ఉపయోగించినట్లు వెల్లడించారు.. KP











