--మెదక్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
రాత్రి వేళల్లో పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్, బీట్ డ్యూటీలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు.
అర్ధరాత్రి పోలీస్ విధులపై అదనపు ఎస్పీ ఆకస్మిక తనిఖీ ..పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్, బీట్ సిబ్బంది విధుల పరిశీలన ..అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ హమారా చార్మినార్ వార్తపత్రిక మెదక్ జిల్లాప్రతినిధి రాత్రి వేళల్లో పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్, బీట్ డ్యూటీలను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును పరిశీలించారు.ప్రధాన రహదారులు, కూడళ్లు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. అనుమానితుల వివరాలను ఫింగర్‌ప్రింట్ ఆధారిత పాపిలాన్ డివైస్ ద్వారా పరిశీలించాలని సూచించారు. వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలను పరిశీలించాలని సూచించారు. బీట్ సిబ్బంది తమ పరిధిలోని కాలనీలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో విస్తృతంగా పర్యటిస్తూ నేరాల నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దొంగతనాలు, ఇతర ప్రాపర్టీ నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘాఏర్పాటు చేయాలని, ముందస్తు చర్యలతో నేరాలను అరికట్టాలని అదనపు ఎస్పీ ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని అదనపు ఎస్పీ తెలిపారు.











