హైదరాబాద్, జూలై 12
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పందించారు.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌పై రివార్డు కూడా ప్రకటించారు.
అయితే, ఈ కేసులో కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కుమార్, పోలీసుల ఎన్కౌంటర్లో మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మల్కారం గ్రామం సమీపంలో రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ఎన్కౌంటర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పందించారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం తనిఖీలు వేగవంతం చేశామని, మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నామని ఆయన తెలిపారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అటవీ ప్రాంతంలోకి రాజకుమార్ వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు.












