ఉట్నూర్, 12 July
ఉట్నూర్ మండలం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉట్నూర్ వెళ్లడం తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ పురుగుమందు తాగి చేసుకుంది. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందింది.
ఉట్నూర్ మండలం చెరువుగూడ జీపీ తాటిగూడకు చెందిన కోవ మాన్కు అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. చేను పనులకు ఎందుకు రావట్లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై శనివారం ఇంట్లోనే పురుగుమందు తాగిందని ఎస్ఐ విజయ్ తెలిపారు.
వెంటనే ఆమె తండ్రి తలుపు పగులగొట్టి, యువతిని మొదట ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మృతి చెందింది.












