Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 25
సూడచయతచేటటతయేకఓటబతకయకఓటటఅధకతచ.వఇతతకవ,ణచఓటఉటతె.అవకేఓటకకఉడేబతసడేఈకయధఉేఅధకేకొ.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల గ్రామ పంచాయతీలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో 353 మంది ఓటర్లు గైర్హాజరైనట్లు గుర్తించారు. వీరిలో ఇతర ప్రాంతాలకు మారినవారు, మరణించిన ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామంలోని మొత్తం 3285 మంది ఓటర్ల జాబితాను బూత్ స్థాయి BLO లు రేఖ రాణి, ఉమ మహేశ్వర్, శైలజ, వసంత, వారి సహయదారులు ఈశ్వర్, ప్రభాకర్, నారాయణ రెడ్డి పరిశీలించారు. ఓటు నమోదైనట్లు గుర్తించిన వారి వివరాలను జాబితాలో నమోదు చేశారు.
ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఈ ప్రత్యేక పరిశీలన చేపట్టినట్లు సర్పంచ్ కునెరు భూమన్న, ఉప సర్పంచ్ అయిర కృష్ణారెడ్డి, సెక్రెటరీ చైతన్య, వార్డు సభ్యులు సీనియర్ అసిస్టెంట్ ఆరుంధతి, రెవెన్యూ అధికారులు తెలిపారు. అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా జాబితాను సరిదిద్దడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.











