ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్సీ బకాయిలు, లీవ్ ఇంక్యాష్మెంట్, గ్రాట్యుటీ డిఫరెన్స్ డబ్బులు సకాలంలో అందకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.











