బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
ప్రభుత్వం తమకు రావాల్సిన అలవెన్సులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, తమకు పీఆర్సీ బకాయిలు ఇప్పించేలా శాసనసభలో మాట్లాడాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌కు వినతి పత్రం అందించారు. ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ వినతి పత్రం అందజేయబడింది.
ప్రభుత్వం తమకు రావాల్సిన అలవెన్సులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, తమకు పీఆర్సీ బకాయిలు ఇప్పించేలా వర్షాకాలపు సమావేశాల్లో శాసనసభలో మాట్లాడాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌కు వినతి పత్రం అందించారు. ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందించారు.
అదేవిధంగా, రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, బీజేపీ పక్షాన శాసనసభలో మాట్లాడతామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల సమస్యలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











