నేడు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..
👉 అధ్యక్షులుగా మాశెట్టి శ్రీనివాస్
మిర్యాలగూడ జులై 19 (మనోరంజని తెలుగు టైమ్స్)
రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ 2026-27 నూతన కార్యవర్గం ఈనెల 20 (సోమవారం) సాయంత్రం 7:00 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం భవనంలోని సమావేశ మందిరంలో 49వ రోటరీ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని నూతన రోటరీ క్లబ్ అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్ తెలిపారు. రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా రేపాల వీరయ్య, ఉపాధ్యక్షులుగా వై నరేందర్, జాయింట్ సెక్రటరీగా లవకుమార్ రాయపూడి, కోశాధికారిగా రంగ హరినాథ్, ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనుండగా ముఖ్యఅతిథిలుగా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గౌరు దయాకర్, క్లబ్ ట్రైనర్ గా కుక్కడపు రామ్మూర్తి, మంచుకొండ వెంకటేశ్వర్లు, రేపాల అంతయ్య తదితరులు పాల్గొన్నారు.












