మిర్యాలగూడ, జులై 21
మిర్యాలగూడలో జరిగిన రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్ కు ఘనంగా సన్మానించారు.
రోటరీ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో సోమవారం రాత్రి రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ 2026-27 49వ రోటరీ, ఇన్నర్ వీల్ క్లబ్ ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
ఇన్స్టాలేషన్ ఆఫీసర్ హరిహర ప్రసాద్, ఇండక్షన్ ఆఫీసర్ రొటేరియన్ జి అశోక్ బాబు నూతన కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్ తోపాటు పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేసి బాధ్యతలు చేపట్టారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పనులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చురుకుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, జిల్లా నాయకులు గుడిపాటి నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి (బాబి), ఉపాధ్యక్షులు గోళ్ళ రామశేఖర్ లు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్ కు ఘనంగా సన్మానించారు.
ఐడబ్ల్యూఎం అధ్యక్షురాలుగా మా శెట్టి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా రేపాల వాసవి, ఐ ఎస్ ఓ గా లఘువరపు శిల్ప ప్రమాణస్వీకారంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు రాయపూడి భవాని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గౌరు దయాకర్, క్లబ్ ట్రైనర్ కుక్కడపు రామ్మూర్తి, మంచుకొండ వెంకటేశ్వర్లు, రేపాల అంతయ్య, రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేపాల వీరయ్య, ఉపాధ్యక్షులు వై నరేందర్, జాయింట్ సెక్రటరీ లవకుమార్ రాయపూడి, కోశాధికారి రంగ హరినాథ్ లతోపాటు రొటేరియన్ గంధం శ్రీనివాస్, అహమద్, పంకజ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.











