మిర్యాలగూడ, జులై 21
సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ గంపా నాగేశ్వరరావు ప్రారంభించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ ఏర్పాటు చేయబడింది. మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ బాధ్యతలు స్వీకరించారు.
సమాజానికి ఎంతో సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ గంపా నాగేశ్వరరావు ప్రారంభించిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్ మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ తెలిపారు.
మిర్యాలగూడలోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో క్లబ్ ప్రెసిడెంట్ గా మాశెట్టి శ్రీనివాస డైమండ్, సెక్రటరీగా నక్క మంగతాయి, ట్రెజరర్ గా మామిడాల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ డైమండ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి తన వంతు ఆర్థిక సహాయం చేయడంతో పాటు పేదలకు చేయూతను అందించేందుకు, మిర్యాలగూడ డైమండ్ ఆధ్వర్యంలో ప్రజలకు, విద్యార్థులకు, యువతకు మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా నేషనల్ ట్రెజరర్ నూనె సుదర్శన్ మాట్లాడుతూ, ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గొప్ప మనసున్న మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఈ క్లబ్ ప్రారంభించి సేవ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. ఈ క్లబ్ ఆనతి కాలంలోనే ఎంతో స్థాయికి ఎదిగి గొప్ప గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
రీజినల్ ప్రెసిడెంట్ కోట సరిత మాట్లాడుతూ, ఈ సమాజానికి మన వంతు సహాయం చేయాలని కోరారు.











