మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని “ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ (AHO) ఫౌండేషన్” తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు బాదావత్ రజిత నాయక్‌కు సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జాతీయ సేవా రత్న అవార్డు లభించింది. ఈ సందర్భంగా సిఐటియు కీసర మండల కమిటీ ఆమెను అభినందించింది.
ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ (AHO) ఫౌండేషన్ అధ్యక్షురాలు రజిత నాయక్‌కు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డును కూడా ప్రదానం చేసినట్లు సిఐటియు కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు తెలిపారు. ఈ అవార్డులు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పేదల వివాహాలకు ఆర్థిక సహాయం, రక్తదాన శిబిరాల నిర్వహణ వంటి పలు సేవా కార్యక్రమాలలో రజిత నాయక్ క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఈ సేవా దృక్పథానికి గుర్తింపుగా తిరుపతిలో శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమెకు జాతీయ సేవా రత్న అవార్డును అందజేశారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఈ అవార్డు స్ఫూర్తినిస్తుందని, ప్రజలకు మరింత చేరువయ్యేలా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని రజిత నాయక్ తెలిపారు. తన సేవలకు లభించిన ఈ గుర్తింపు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.








