Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ (ఎమ్మార్వో)కు వినతిపత్రం అందజేసి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని కోరారు.
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ పార్టీ నాయకులు నినాదాలు చేశారు.
అనంతరం మండల తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ (ఎమ్మార్వో)కు వినతిపత్రం అందజేసి, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్, కాలగిరి గంగా రెడ్డి, వికాస్ రెడ్డి, బాపయ్య, పడాల శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












