బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 29
ఆదిలాబాద్ జిల్లా పి.ఎస్.హెచ్.ఎం. నూతన కమిటీ ఎన్నిక బుధవారం జిల్లా కేంద్రంలోని ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి అధక్, కమిటీ అధ్యక్షుడు సుభాష్, కార్యదర్శి గోవింద్ సమక్షంలో జరిగింది. ఈ ఎన్నికలో రావుల శంకర్ అధ్యక్షుడిగా, మోహన్ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆదిలాబాద్ జిల్లా పి.ఎస్.హెచ్.ఎం. నూతన కమిటీ ఎన్నిక బుధవారం జిల్లా కేంద్రంలోని ద్వితీయ శ్రేణి ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి అధక్, కమిటీ అధ్యక్షుడు సుభాష్, కార్యదర్శి గోవింద్ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయింది.
ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా రావుల శంకర్, ప్రధాన కార్యదర్శిగా మోహన్, మహిళా అధ్యక్షురాలిగా కె. అరుణ, ఉపాధ్యక్షుడిగా మెస్రం రవీంద్ర, ఆర్థిక కార్యదర్శిగా పవార్ సదానందం, కార్యదర్శులుగా నైతం జైతు, రాథోడ్ దినేష్, కౌసల్య, రాథోడ్ సుభాష్, గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షుడు రావుల శంకర్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.












