పశువేముల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
సమాజంలో అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించడమే పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ వెల్ఫేర్ ఎవర్ని సార్గనేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు అన్నారు. పల్నాడు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సోమవారం సాయంత్రం మాచర్ల మండలం పశువేముల గ్రామం ఎస్సీ కాలనీలో, మాచర్ల తహశీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన పౌర హక్కులు, వాటిపై చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. పౌర హక్కుల చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీలలో పౌర హక్కుల దినోత్సవం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేయడం హర్షనీయం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, అర్హులై ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందనట్లయితే, సమస్యలను అర్జీ రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలియజేశారు.
పశువేముల వీఆర్వో చిరంజీవి నాయక్ మాట్లాడుతూ, హక్కులతో పాటు ప్రతి మనిషి బాధ్యతగా ఉండాలని, సామాజిక స్పృహతో ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు.
అనంతరం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ ప్రజలు స్మశాన స్థలానికి వెళ్లడానికి దారి లేదని, దారి ఏర్పాటు చేయాలని, బోరు ఉన్నా మోటారు లేదని, మోటారు ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ కాలువలలోని మురికి నీరు రోడ్లపైకి వస్తుందని, వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి కాలువల్లో పూడిక తీయించాలని పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలపై వీఆర్వో సానుకూలంగా స్పందించి, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కర్రా చిన రంగయ్య, దేవదానం, సీనియర్ టీడీపీ నాయకులు పుల్లారావు, కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.