షాద్నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
షాద్నగర్ పట్టణంలో సయ్యద్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సీరత్-ఉన్-నబీ జల్సా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జామియతుల్ మోమినాత్ ప్రిన్సిపాల్ డాక్టర్ రిజ్వానా జరీన్, యువత ఆధ్యాత్మికత వైపు మళ్లాలని, సత్ప్రవర్తనతో జీవించాలని పిలుపునిచ్చారు.
షాద్నగర్ పట్టణంలో సయ్యద్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సీరత్-ఉన్-నబీ జల్సా ఘనంగా నిర్వహించారు. సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సభ్యులు, ఫోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆలియా సుల్తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి, హైదరాబాద్కు చెందిన జామియతుల్ మోమినాత్ ప్రిన్సిపాల్ డాక్టర్ రిజ్వానా జరీన్ పీహెచ్డీ, శకుని హదీస్ ముఖ్య అతిథిగా హాజరై దైవ సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రిజ్వానా జరీన్ మాట్లాడుతూ.. అల్లాహ్ మనిషికి మానవ రూపాన్ని ప్రసాదించిన ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని, సోదరభావంతో సమాజానికి ఉపయోగపడే విధంగా తమ జీవితాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కులమత భేదాలకు అతీతంగా తోటి వారితో సోదరభావంతో మెలగాలని, యువత తమ యవ్వన దశను ఆధ్యాత్మికత వైపు మళ్లించి, సత్ప్రవర్తనతో జీవించాలని పిలుపునిచ్చారు.
నేటి యువత చెడు మార్గాలకు ఆకర్షితులు కాకుండా, ఖురాన్ బోధనలు, ఆధ్యాత్మిక విలువలను అలవర్చుకోవాలని ఆమె అన్నారు. అల్లాహ్ ప్రసాదించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవాలని, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా సయ్యద్ సుల్తాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలియా సుల్తానాకు, డాక్టర్ రిజ్వానా జరీన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సుమారు వెయ్యి మందిని ఒకే వేదికపై సమీకరించి, అందరి ఆశీస్సులు పొందేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన సొసైటీ సభ్యులు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












