లోకేశ్వరం, 2023-09-01
లోకేశ్వరం మండల కేంద్రంలో వీబీజీరామ్‌జీ పథకానికి సంబంధించి గ్రామసభను గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజల అవసరాలకు అనుగుణంగా గుర్తించాలని సర్పంచ్ సూచించారు.
లోకేశ్వరం మండల కేంద్రంలో వీబీజీరామ్‌జీ పథకానికి సంబంధించి గ్రామసభను గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజల అవసరాలకు అనుగుణంగా గుర్తించాలని సర్పంచ్ కపిల్ సూచించారు.
గ్రామానికి మేలు చేసే పనులకు ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు కల్పించేలా అవసరమైన పనులను గుర్తించాలని ఆయన తెలిపారు. గ్రామసభలో ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వాటి ఆధారంగా పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సర్పంచ్ కపిల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏపీవో అనిల్, టీఏ శారద, ఫీల్డ్ అసిస్టెంట్ అంబకంటి శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












