రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి మొదటి స్థానం సాధించిన నిర్మల్ జిల్లా షీ టీమ్ సభ్యులను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు. ఈ విజయం జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ, షీ టీమ్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని, మహిళలు, బాలికల భద్రతకు వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో, ఫిర్యాదులపై తక్షణ స్పందన చూపడంలో షీ టీమ్ సమర్థవంతంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
ఈ పనితీరు వల్లే రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించగలిగారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ మరింత సమర్థవంతంగా పనిచేసి మరిన్ని విజయాలు సాధించాలని షీ టీమ్ సభ్యులకు ఆమె సూచించారు.
షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ ఎం. నర్సయ్యతో పాటు టీమ్ సభ్యుల సేవలను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం జిల్లా పోలీసు శాఖకు ఎంతో గర్వకారణమని ఆమె అన్నారు.












