నిర్మల్, 18 July
నిర్మల్‌లో ఇళ్లలో, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో మిగిలిపోయే ఆహారాన్ని వృథా చేయకుండా సేవా ఫౌండేషన్‌కు అందించాలని సేవా ఫౌండేషన్ నిర్మల్ నిర్వాహకులు గట్టు శ్రీనివాస్ కోరారు. పరిశుభ్రమైన ఆహారాన్ని సేకరించి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, అనాథలు, నిరాశ్రయులకు అందజేస్తామని ఆయన తెలిపారు.
ఇళ్లలో, హోటళ్లలో, రెస్టారెంట్లలో, ఫంక్షన్ హాళ్లలో, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో మిగిలిపోయే ఆహారాన్ని వృథా చేయకుండా సేవా ఫౌండేషన్‌కు అందించాలని సేవా ఫౌండేషన్ నిర్మల్ నిర్వాహకులు గట్టు శ్రీనివాస్ కోరారు.
మిగిలిన పరిశుభ్రమైన ఆహారాన్ని సేకరించి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, అనాథలు, నిరాశ్రయులకు అందజేస్తామని తెలిపారు. ప్రతి రోజు ఎంతో ఆహారం వృథా అవుతుండగా, అదే ఆహారం ఎంతో మంది ఆకలిని తీర్చగలదని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లలో, హోటళ్లలో, ఫంక్షన్ హాళ్లలో లేదా వివాహ వేడుకల్లో మిగిలిన ఆహారం ఉంటే వెంటనే 7989181895 నంబర్‌కు కాల్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే సేవా ఫౌండేషన్ బృందం అక్కడికి చేరుకుని ఆహారాన్ని సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేస్తుందని తెలిపారు.
"అన్నదానం మహాదానం" అనే భావనతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథా చేయకుండా ఈ సేవలో భాగస్వాములు కావాలని సేవా ఫౌండేషన్ నిర్మల్ నిర్వాహకులు గట్టు శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.












