ఆర్మూర్, జూలై 17
ఆర్మూర్: పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్గా ఎన్నికైన రొటరియన్ ఖాందేశ్ సత్యంకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో నేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆర్మూర్: నూతనంగా పట్టు చేనేత సహకార సంఘం డైరెక్టర్గా గెలుపొందిన రొటరియన్ ఖాందేశ్ సత్యంను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూల బొకే, శాలువాను అందజేశారు.
రోటరీ క్లబ్ అధ్యక్షులు వన్నెల్ దేవి రాము, సెక్రటరీ పివిఆర్ శ్రీకాంత్, కోశాధికారి రాస ఆనంద్ సమక్షంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఖాందేశ్ సత్యం మాట్లాడుతూ, నేత కార్మికులకు ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతి నేత కార్మికుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రోటరీ 3150 మాజీ గవర్నర్ హన్మంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, రోటరియన్స్ దాసరి సునీల్ కుమార్, చరణ్ రెడ్డి, వంగ వివేకానంద, రాధాకిషన్, సురేష్, చోటి లింబాద్రి, చెలిమేల రాజేందర్, కత్రాజీ రాజేందర్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.












