లోకేశ్వరం, జూలై 17
లోకేశ్వరం మండల కేంద్రంలో దివ్యాంగ పిల్లల కోసం 'భావిత' (సహిత విద్యావనరుల కేంద్రం)ను ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగు వీల్చైర్లు, రెండు వినికిడి పరికరాలు, నాలుగు సుగమ్య కర్రలను అవసరమున్న దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేశారు.
లోకేశ్వరం మండల కేంద్రంలో దివ్యాంగ పిల్లల కోసం ఏర్పాటు చేసిన 'భావిత' (సహిత విద్యావనరుల కేంద్రం)ను ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవసరమున్న దివ్యాంగులకు నాలుగు వీల్చైర్లు, రెండు వినికిడి పరికరాలు (హియరింగ్ ఎయిడ్స్), నాలుగు సుగమ్య కర్రలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగ పిల్లల మానసిక, శారీరక వికాసానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇక్కడ విద్యాబోధనతో పాటు నిత్యకృత్యాల శిక్షణ, ఆటపాటలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకుని పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.












