మిర్యాలగూడ, 2026-08-16
విద్యా రంగానికి కొర్ర కృష్ణకాంత్ నాయక్ అందించిన సేవలు అభినందనీయమని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు లావూరి రవీందర్ నాయక్ అన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణకాంత్ నాయక్ నల్గొండ డైట్ లెక్చరర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
విద్యా రంగానికి కొర్ర కృష్ణకాంత్ నాయక్ అందించిన సేవలు అభినందనీయమని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు లావూరి రవీందర్ నాయక్ అన్నారు. గిరిపుత్రుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రభుత్వ ఉపాధ్యాయులు కృష్ణకాంత్ నాయక్ నల్గొండ డైట్ లెక్చరర్‌గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
వక్తల ప్రశంసలు
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో తాను నమ్మిన సిద్ధాంతాల కొరకు పాటుపడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యారంగ సమస్యలపై అవగాహన కలిగిన ఆయన ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది భావితరాలకు అందించారన్నారు. నూతనంగా చేపట్టిన డైట్ లెక్చరర్ బాధ్యతలు మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కృష్ణకాంత్ నాయక్ స్పందన
సన్మాన గ్రహీత కృష్ణకాంత్ నాయక్ మాట్లాడుతూ కొత్త బాధ్యతలతో నూతన శకానికి నాంది పలుకుతానని, భవిష్యత్తులో విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానన్నారు. తనపై చూపిన అభిమానానికి, గౌరవానికి గిరిజన విద్యార్థి సంఘ నాయకులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు సైదా నాయక్, మండల విద్యాధికారి ధర్మానాయక్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లావురి బాలు నాయక్, వడ్డే రాజు, వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి చిన్న వెంకన్న, సంయుక్త కార్యదర్శి రత్నకుమార్, ఉపాధ్యాయులు జగన్ చింతామధు, గంట సుధాకర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












