బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
బోథ్ మండల కేంద్రంలోని వాగ్దేవి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
మండల కేంద్రంలోని వాగ్దేవి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. వాతావరణ మార్పులు, కాలుష్య నియంత్రణ, జీవ వైవిధ్య పరిరక్షణలో చెట్ల పాత్ర కీలకమని వివరించారు.
ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ, ప్రకృతిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పోశెట్టి, హరీష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.












