మిర్యాలగూడ, 2026-08-15
నల్లగొండ జిల్లా కేంద్రంలోని దుర్గబాయి దేశ్ ముఖ్ మహిళా సంక్షేమ వికాస కేంద్రం జిల్లా మేనేజర్ గా రేఖల మమత బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓఝా ఆదేశాలు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని దుర్గబాయి దేశ్ ముఖ్ మహిళా సంక్షేమ వికాస కేంద్రం జిల్లా మేనేజర్ గా రేఖల మమత బాధ్యతలు స్వీకరించారు. మిర్యాలగూడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు ఆఫీసర్ గా పనిచేస్తున్న ఒకరు దీర్ఘాకాలిక సెలవుపై వెళ్లడంతో, సీడీపిఓగా ఉన్న రేఖల మమతకు సెలవు అనంతరం కొండమల్లేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టుకు ఏసీడీపీఓ పోస్టుకు బదిలీ చేశారు.
డిప్యూటేషన్ పై నియామకం
ఆమెకు ఒక సంవత్సర కాలానికి జిల్లా వికాస కేంద్రం మేనేజర్ గా డిప్యూటేషన్ ఇస్తూ రాష్ట్ర మహిళ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓఝా జూలై 31న ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు ఆమె కేంద్రంలో శుక్రవారం సాయంత్రం విధుల్లో చేరారు.
సిబ్బంది స్వాగతం
విధుల్లో చేరిన రేఖల మమతను కేంద్రం సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.












