ముధోల్, జూలై 14
ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు సాపెవార్ కిష్టయ్య నియమితులయ్యారు. ఆయన నియామకంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు సాపెవార్ కిష్టయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని శుభాకాంక్షలు తెలియజేశారు.












