శాసన మండలి సభ్యుడిగా ప్రొఫెసర్ కోదండరాం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా తెలంగాణ జేఏసీ చైర్మన్ తాడిమేలా యాదగిరి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
శాసన మండలి సభ్యుడిగా ప్రొఫెసర్ కోదండరాం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా తెలంగాణ జేఏసీ చైర్మన్ తాడిమేలా యాదగిరి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాడిమేలా యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు గృహ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
త్వరలో మెదక్లో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని యాదగిరి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో విద్య కమిషన్ సభ్యులు విశ్వేశరరావు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, ఓయూ జేఏసీ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ప్రజా సమస్యల పరిష్కారంలో శాసన మండలిలో తనవంతు పాత్ర పోషించాలని నాయకులు ఆకాంక్షించారు.












