ముధోల్ మండలం గన్నోర గ్రామంలో ఆదివారం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతిష్టించి, బస్టాండ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు.
బస్టాండ్ వద్ద గ్రామ సర్పంచ్ రాజు భారతరత్న డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, జెండాను ఆవిష్కరించారు. అనంతరం బుద్ధ వందన, ధమ్మ వందన, సంఘం వందన, త్రిశరణ పంచశీల పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన ఆశయాలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ వేడుకలలో ఎస్సై దాస సుధాకర్, మనోహర్, ఉప సర్పంచ్ పెంటన్న, ప్రముఖ జానపద నేపథ్య గాయని లక్ష్మి, అష్ట దిగంబర్, రాజేశ్వర్, గౌతమ్, న్యాయవాది శంకర్, భీమ్రావు, బౌద్ధ ఉపసకులు, ఉపసికలు, గ్రామస్తులు, దళిత మహిళా సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.








