మిర్యాలగూడ పట్టణంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తన 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకుంది. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, సీనియర్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర నాయకులు అన్నబీమోజు నాగార్జున చారి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.
కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంబరాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఇలియాస్, కౌన్సిలర్లు పెద్ది శ్రీనివాస్ గౌడ్, దినేష్, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు షోయబ్, సాదినేని శ్రీనివాసరావు, పూనాటి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ (ఆయిల్) రైస్ మిల్లర్ గణేష్, గయాస్, మస్తాన్, కొత్తగూడెం గ్రామనేత మహమూద్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.












