మిర్యాలగూడ, జూలై 15
మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి శనివారం సీతారాంపూర్ లోని 75 పోలింగ్ స్టేషన్ ను సందర్శించి ఎస్ఐఆర్(సర్) పనులను పరిశీలించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి శనివారం భాగంగా సీతారాంపూర్ 75 పోలింగ్ స్టేషన్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎస్ఐఆర్(సర్) పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ విషయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ సక్రమంగా పని పూర్తి చేయాలని, ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిదన్నారు.
ఎస్ఐఆర్ పని విషయంలో పని చేయని బూతు లెవెల్ ఆఫీసర్లు, మెప్మా అర్పిల మీద శాఖాపర చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, వార్డు కౌన్సిలర్ షబానా బేగం అయుబ్, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీనివాసు, మెప్మా ఆర్పీలు, బిఎల్ఓలు పాల్గొన్నారు.












