Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
నిర్మల్ పట్టణంలో ఇటీవల తనిష్క అపార్ట్మెంట్లో జరిగిన దుర్ఘటనలో బాధితులైన కుటుంబాన్ని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కె. రాంకిషన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు.
నిర్మల్ పట్టణంలోని తనిష్క అపార్ట్మెంట్లో ఇటీవల జరిగిన దుర్ఘటనలో బాధితులైన కుటుంబాన్ని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కె. రాంకిషన్ రెడ్డి పరామర్శించారు.
బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఆయన, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు.
పరామర్శ కార్యక్రమంలో నిర్మల్ మండల పార్టీ కన్వీనర్ పి.వి. మహేశ్వర్ రెడ్డి, లక్ష్మణచందా మండల పార్టీ కన్వీనర్ కె. కృష్ణారెడ్డి, మామడ మండల పార్టీ కన్వీనర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












