నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి సబ్-ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ఎస్సై శ్రీకాంత్ వివరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహన యజమానుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసులు నిర్వహించిన ఈ తనిఖీల్లో పలువురు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచనలు జారీ చేశారు.










