29వ వార్డు సందర్శించి.. పారిశుద్ధ్య పనుల తనిఖీ : కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి
మిర్యాలగూడ జులై 24 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకుగాను మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజా రెడ్డి, కౌన్సిలర్ జావిద్, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ తో కలిసి 29వ వార్డును సందర్శించారు. వార్డు పరిధిలోని ప్రతి గల్లి, గల్లి కి తిరిగి కాలనీ వాసులతో పారిశుద్ధ్య సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.












